ఆ స్టార్ హీరోకు సిగ్గు ఉండదు.. బట్టలు వేసుకోకుండానే తిరుగుతాడు.. పరిణీతి చోప్రా ఆసక్తికర కామెంట్స్!

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా రికీ బహ్ల్ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది.

Update: 2024-05-26 08:30 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా రికీ బహ్ల్ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ప్రస్తుతం రెండు, మూడు మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరిణీతి ఓ స్టార్ హీరో పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ బట్టలు లేకుండా ఉంటాడని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రణవీర్‌ సింగ్‌తో చేసిన సినిమా షూటింగ్ సెట్స్‌లో జరిగిన కొన్ని విషయాలను పంచుకుంటూ ఆమె మాట్లాడుతూ ‘‘రణవీర్ ఒక్కొక్క డిజైన్ డ్రెస్సులు ధరించి ఈ రోజు అదే లుక్ అంటాడు. అప్పుడప్పుడు సెట్‌లో ప్యాంటు వేసుకోకుండా వచ్చి పక్కన కూర్చునే వాడు. ప్యాంటు వేసుకోవచ్చు కదా అని ఎవరో ఒకరు అంటే వేసుకుని వచ్చేవాడు.

అయితే నేను అతని క్యారవాన్‌లోకి వెళ్లడానికి కాస్త ఆలోచించి అతని పర్మిషన్ తీసుకుని వెళ్లేదాన్ని. ఎందుకంటే అతను నిద్రపోతాడు లేదా వాష్ రూమ్‌లో ఉంటాడో అని కాదు. బట్టలు లేకుండా ఉన్నాడా అని తెలుసుకుని వెళ్లాను. అయితే కొన్నిసార్లు లోపలికి రావచ్చు అని అడిగినప్పటికీ అతను బట్టలు వేసుకోకుండానే ఎదురుగా నిలబడి సమాధానమిచ్చేవాడు. అయితే రణవీర్ దుస్తులు లేకుండా చూసిన ఏం సిగ్గుపడడు. కానీ మనమే ఫీల్ కావాల్సి వస్తుంది. నేను ఒకసారి బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతావు అని అడిగితే.. అలా చూడటం వల్ల ఇతరుల జీవితాలు మారవు కదా అన్నాడు. అయితే ఒకసారి రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు ప్యాంట్ లేకుండానే సెట్‌లో కనిపించాడు. దీంతో నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పడంతో ప్యాంటు వేసుకుని వచ్చాడు’’ అని చెప్పుకొచ్చింది.

Similar News