షూటింగ్ సమయంలో ఆ హీరో నన్ను బాగా వేధించాడు.. Nithya menen కామెంట్స్ వైరల్

టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

Update: 2023-06-15 05:43 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. పలు స్టార్ హీరోలతో నటిస్తూ మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా ముందుకు సాగుతోంది. అయితే నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతుందని వచ్చిన రూమర్స్‌కు ఈ అమ్మడు ఘాటుగా స్పందించింది. ఇదిలా ఉంటే ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్‌కు గురైనట్లు మీడియా ముఖంగా చెబుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందు. తా జాగా, ఓ ఇంటర్య్వూలో తాను కూడా మీటూ క్యాస్టింగ్ కౌచ్‌కు గురైనట్లు నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు చేసి అందరికీ షాకిచ్చింది. ‘‘ కామాంధులు అన్ని రంగాల్లో ఉంటారు. సినీ రంగంలోనే ఇలాంటి వ్యక్తులు ఉంటారు అని.. మనం చెప్పలేం తెలుగు ఇండస్ట్రీలో నేను ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేయలేదు కానీ.. తమిళంలో మాత్రం ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక హీరో నన్ను బాగా వేధించాడు సీన్ చేస్తున్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read:  తమన్నా తన కోరిక తీర్చుకొని వదిలేస్తది.. ఆమె బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్

Tags:    

Similar News