పెళ్లైన మూడేళ్లకే విడాకులు తీసుకోబోతున్న బుల్లితెర జంట.. ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసిందిగా!

ఇటీవల ఇండస్ట్రీలో విడాకులు కేసులు భారీగా పెరిగిపోయాయి. చిన్న చిన్న మనస్పర్థలు రావడంతో డైవర్స్ తీసుకుని విడిపోతున్నారు.

Update: 2024-05-23 11:56 GMT

దిశ, సినిమా: ఇటీవల ఇండస్ట్రీలో విడాకులు కేసులు భారీగా పెరిగిపోయాయి. చిన్న చిన్న మనస్పర్థలు రావడంతో డైవర్స్ తీసుకుని విడిపోతున్నారు. అయితే ఇప్పటికే ఎంతో మంది విడిపోయి కొందరు అధికారికంగా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ మరికొందరు ప్రకటించకుండా సోషల్ మీడియా వేదికగా పెట్టే పోస్టులతో నెటిజన్లు విడాకులు తీసుకున్నట్లు ఓ నిర్ధారణకు వస్తున్నారు. అయితే గత కొద్ది కాలంగా బుల్లితెర జంట సంజయ్- పూనమ్ విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నటుడు సంజయ్ ఓ పోస్ట్ పెట్టి తొలగించడంతో.. విడాకుల రూమర్స్‌ మరోసారి జోరందుకున్నాయి. 2021లో పెళ్లి చేసుకున్న వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజయ్ విడాకులపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘‘ గత కొద్ది కాలంగా నేను నా భార్యతో విడాకులు తీసుకోబోతున్నానని వార్తలు వస్తున్నాయి. అయితే నేను మొదటి సారి వాటిని చూసినప్పుడు షాక్ అయ్యాను. అదేంటి మేము విడాకులు తీసుకోవడం ఏంటని అయోమయంలో పడిపోయాను. అప్పుడే క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. కానీ ఆ వార్తలు చూసాక నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అప్పుడు అర్థం కాలేదు. నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. అయితే ఆ వార్తలు ఆమె చూస్తే ఎంత బాధపడుతుందో అనిపించి కంగారు పడ్డాను.

కానీ ఆమె కూడా నటి కాబట్టి అర్థం చేసుకుంటుంది అనిపించింది. మేమేంటో మాకు తెలుసు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది. కాబట్టి ఈ ప్రపంచం మా గురించి ఏమనుకుంటుందో అని పట్టించుకోను. అలాగే విడాకుల వార్తలను కూడా లైట్ తీసుకున్నాను. అయితే కొద్ది రోజుల ముందు నేను ఒక న్యూస్ చూశాను. అందులో నేను విడాకుల కోసం లాయర్ దగ్గరకు కూడా వెళ్లానని పెట్టారు. అది చూసిన చాలా నవ్వుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను అసలు మాకు విడాకులు తీసుకునే ఆలోచన కూడా లేదు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. జీవితాంతం కలిసే ఉంటాం. ఇలాంటి రూమర్స్ ఎన్ని వచ్చిన పట్టించుకోము’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సంజయ్ కామెంట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Similar News