రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన హేమ కొత్త ఆర్టిస్ట్‌లతో చేసే చీకటి బాగోతం ఇదే.. సంచలన వీడియో రిలీజ్ చేసిన తమన్న

బెంగళూరు రేవ్ పార్టీలో పలువురు తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నట్లు గత రెండు రోజుల నుంచి ఎన్నో వార్తలు వస్తున్నాయి.

Update: 2024-05-22 13:07 GMT

దిశ, సినిమా: బెంగళూరు రేవ్ పార్టీలో పలువురు తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నట్లు గత రెండు రోజుల నుంచి ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కానీ మేమ మాత్రం తాను బెంగళూరులో లేనని హైదరాబాద్‌లో ఉన్నట్లు ఓ వీడియో రిలీజ్ చేసింది. తనకు ఆ రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నట్లు చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు హేమను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, బిగ్‌బాస్ బ్యూటీ తమన్నా సింహాద్రి హేమ చేసే పనులు ఇవే అందుకే అన్ని ప్రాపర్టీస్ సంపాదించంటూ ఓ సంచలన వీడియోను రిలీజ్ చేసింది.

‘‘ మన హేమ అక్క బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికింది. ఏ రకంగా చూసినా మన అక్క ఎన్నో పార్టీల్లో దొరికిపోతుంది. గుంటూర్‌‌లో రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోద్ది వాళ్ల వీళ్ల రికమెండేషన్స్‌తో బయకొచ్చేస్తది. ఈ రకంగా దొరికిపోద్ది.. ఆమె ఏమి బాహుబలి హీరోయిన్ కాదు. మళ్లీ చేసేది చిన్నా చితకా క్యారెక్టర్స్ చేస్తది. కానీ ప్రాపర్టీస్ మాత్రం భీబత్సంగా ఉంటాయి. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిపోయిన అక్క ఓ వీడియో పోస్ట్ చేసింది. నేను బెంగళూరులో లేను హైదరాబాద్‌లో ఉన్నా అని. మరి అలాంటప్పుడు ఇళ్లు చూపించవచ్చు కదా చెట్ల దగ్గర నిల్చొని ఒక వీడియో పెట్టింది. ఎవరు చెవుల్లో పూలు పెడతారండి అసలు.. వీళ్లకి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.

చేసేదేమి హీరోయిన్స్‌లా కాదు ఏమి కాదు. ఏదో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇప్పుడు కాకపోయిన ఎప్పటికైనా ఈ అక్కను మాత్రం నేను వదలను. టైమ్ కోసం ఎదురుచూస్తున్నా. అక్క ఎన్నోసార్లు దొరికిపోద్ది ఆమె చేసేదే ఇలాంటి పనులు. కొత్తగా అందమైన అమ్మాయిలు ఆర్టిస్ట్‌లను వలలో వేసుకుని వాళ్లని మోసళ్లకి కోడిని ఎరగా ఎలా వేస్తారో అలా వేసి డబ్బులు సంపాదించుకుంటుంది హేమ. అక్క బదుకు ఇది నీ గూబ పగల కొడతా ముందు ముందు చూడు ఆ రోజు కచ్చితంగా వస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా సింహాద్రి కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు హేమ అలాంటి పనులు చేసి డబ్బులు సంపాదించిందా? అని షాక్ అవుతున్నారు.

Similar News