'సూసేకీ అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి'..'పుష్ప 2' నుంచి ఊర మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్

దర్శకుడు సుకుమార్, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కాంబోలో పుష్ప సినిమాకి సీక్వేల్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప 2’. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తుంది.

Update: 2024-05-23 09:14 GMT

దిశ, సినిమా: దర్శకుడు సుకుమార్, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కాంబోలో పుష్ప సినిమాకి సీక్వేల్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప 2’. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తుంది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫసీల్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు.. మేకర్స్ ఈ మూవీకి సంబంధించి అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ సినీ ప్రియుల్ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు.

ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి 'జాతర' యాక్షన్ సీన్లను రిలీజ్ చేశారు. అందులో బన్నీ.. మాస్ యాక్షన్ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసిన ఆ సాంగ్ సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా అందులో బన్నీ వేసే క్లాసిక్ స్టెప్పులు కూడా ఓ రేంజ్‌లో ట్రెండ్ అయ్యాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఆ స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే ఈ మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ ట్విట్టర్ ఖాతాలో అదిరిపోయే ట్వీట్ పెట్టారు.''రేపు ఉదయం 11.07'' గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నామని తెలిపారు.

తాజాగా మేకర్స్ చెప్పిన విధంగానే ఈ రోజు (గురువారం) సరిగ్గా 11 గంటల 7 నిమిషాలకు రెండో పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. 'సూసేకీ అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి' అంటూ అల్లు అర్జున్, కథానాయిక రష్మిక మందన్నాలపై చిత్రీకరించిన పాటను ఈ నెల 29న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Full View

Similar News