సూసైడ్ అటెంప్ట్ చేయాలి అనుకున్నాను.. సూపర్ స్టార్ రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్!

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి సూపర్ స్టార్ రజినీకాంత్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

Update: 2024-05-09 04:56 GMT

దిశ, సినిమా : సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి సూపర్ స్టార్ రజినీకాంత్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా మంది కుర్ర హీరోలకు ఈయన ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇక తాజాగా ఈ హీరో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను అంటూ రజినీకాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నా లైఫ్ జర్నీ చాలా మందికి తెలుసు. మొదట నేను బస్ కండక్టర్. అంతే కాకుండా నేను చాలా ఆఫీసుల్లో పనిచేసాను. కూలీగా కూడా చేశాను. మాది చాలా నిరుపేద కుటుంబం. కానీ నాకు ఎప్పుడూ ధనవంతున్ని కావాలి అనే కోరిక ఉండేది. అలాగే నేను చాలా డేరింగ్‌గా ఉంటాను. దేనికీ భయపడకుండా ఉండేవాడిని, అలాంటిది ఒక రోజు మాత్రం నా జీవితంలో మర్చిపోలేని రోజుగా మారింది. ఆ రోజు నాకు ఎందుకో భయం వేసింది. సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను దేవుడిని పూజిస్తూ ఆయన ఫోటో ముందే చాలా సేపు కూర్చొని ఆలోచించడం వలన దాని నుంచి బయటపడ్డాను.

తర్వాత ఆ రోజు రాత్రి వచ్చిన కల నా జీవితాన్నే మార్చివేసింది. ఆ నైట్ నాకు తెల్లటి గడ్డంతో ఉన్న సంతనోర్వా నదికి అవతలివైపు కూర్చొన్న ఓ స్వామి కనిపించారు. తర్వాత నేను తనతో ఓ మఠానికి వెళ్లి ధనవంతున్ని కావాలని కోరుకున్నాను..ఆ స్వామి రాఘవేంద్ర స్వామి అని చెప్పి ప్రతి గురువారం ఉపవాసం ఉండూ అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాను. అప్పుడు బాలచందర్ సార్ నన్ను గుర్తించారు. ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యానంటూ తలైవా చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇది చూసిన నెటిజన్స్ ఏంటీ మా అభిమాన హీరో సూసైడ్ అటెంప్ట్ చేయాలనుకున్నారా అంటూ షాక్ అవుతున్నారు.

Similar News