Allu Arjun లేకుండానే 'పుష్ప 2' షూటింగ్ ప్రారంభం..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘పుష్ప 2’ ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే బన్ని లేకుండానే షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.. Latest Telugu News

Update: 2022-11-11 07:45 GMT

దిశ,సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ 'పుష్ప 2' ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే బన్ని లేకుండానే షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ ఫ్యామిలీతో సౌత్ ఆఫ్రికా ట్రిప్‌కు వెళ్లగా.. నాలుగైదు రోజుల్లో ఇండియాకు తిరిగొచ్చేయనున్నాడు. కానీ ఆలోపే డైరెక్టర్ సుకుమార్ ఆర్‌ఎఫ్‌సిలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్‌ను ప్రారంభించాడు. ముఖ్యమైన నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లపై సన్నివేశాలు చిత్రీకరించనున్నాడు. మొత్తానికి బన్ని లేకుండానే చిత్రీకరణ ప్రారంభం కావడంపై అభిమానులు కాస్త నిరాశ చెందినా.. ఎట్టకేలకు సినిమా ప్రారంభమైనందుకు మాత్రం హ్యాపీగా ఉందంటున్నారు.

Similar News