ఆ హీరోయిన్ కారణంగా పెళ్లికి నో చెప్పిన స్టార్ హీరో.. ఇక బ్రహ్మచారిగా మిగిలిపోతాడా?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పటికీ ఆయనకు 46 ఏళ్లు వచ్చినా సరే.. యంగ్ హీరోగానే కనిపిస్తుంటాడు. ఇక అంత ఏజ్ వచ్చినా సరే ఈ హీరో మాత్రం

Update: 2024-05-23 10:22 GMT

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పటికీ ఆయనకు 46 ఏళ్లు వచ్చినా సరే.. యంగ్ హీరోగానే కనిపిస్తుంటాడు. ఇక అంత ఏజ్ వచ్చినా సరే ఈ హీరో మాత్రం ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంటున్నాడు. ఈయన పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చినా అవి రూమర్స్ గానే మిగిలిపోతున్నాయి తప్ప తన పెళ్లి అనేది జరగడం లేదు.

అయితే తాజాగా విశాల్ తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయనను ఓ నెటిజన్ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగ్గా, దానికి విశాల్ సమాధానం ఇస్తూ.. సల్మాన్ ఖాన్, శింబు, ప్రభాస్.. ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్న తర్వాతనే తాను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఈ సమాధానంతో ఆయన అసలు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడా.. లేదా బ్రహ్మచార్యం తీసుకుంటాడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తన ఫ్యాన్స్.

ఇక ఈయన వరలక్ష్మీ శరత్ కుమార్‌ను ప్రేమించిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు పాటు రిలేషన్‌లో ఉన్న వీరు తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లిదాక వచ్చిన వీరి బంధం ముగిసి పోయింది. అయితే దీని కారణంగానే విశాల్ పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదేమో అంటున్నారు నెటిజన్స్. అంతే కాకుండా ఆ మధ్య మంచి మంచి సంబంధాలు వచ్చినా తాను వరలక్ష్మీని మర్చిపోలేక వాటిని ఒకే చేయలేదని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం విశాల్ తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కానీ దీని గురించి క్లారిటీగా తెలియదు.

Similar News