Nani: ఎన్నికల వేళ స్టార్ హీరో నాని సంచలన ట్వీట్.. ఎంతైనా హీరో అనిపించుకున్నారు..!

ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Update: 2024-05-07 09:20 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్ని్కల్లో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ అటు రాజకీయ నేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ నెలకొంది. ముఖ్యంగా జనసేన పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలతోపాటుగా అభిమానులు కూడ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్‌కి సాధారణ ప్రజల్లోనే కాదు, స్టార్ హీరోల్లోనూ అభిమానులు ఉన్నారు.

తాజాగా పవన్ గెలవాలని కోరుకుంటే స్టార్ హీరో నాని ట్వీట్ చేశారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారని, మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని అలానే మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నానని, మన మధ్యన సోదరభావం ఉంది, ఆ సోదరభావంతో నేను మీకు మద్ధతు ఇస్తున్నాను, ఆల్ ది బెస్ట్ సార్ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా ఈ ట్వీట్‌పై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎంతెనా హీరో అనిపించుకున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. 

Similar News