అర్ధరాత్రి నిద్రలేపి సింగిల్ షాట్ కావాలన్నాడు.. ఇవ్వక తప్పలేదన్న అర్చిత

దిశ, సినిమా : బంగ్లాదేశ్ యంగ్ యాక్ట్రెస్ అర్చిత స్పోర్షియా బాడీ టాటూస్ గురించి ఓపెన్ అయింది.

Update: 2022-08-13 13:43 GMT

దిశ, సినిమా : బంగ్లాదేశ్ యంగ్ యాక్ట్రెస్ అర్చిత స్పోర్షియా బాడీ టాటూస్ గురించి ఓపెన్ అయింది. తాజా ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'చిన్నప్పటినుంచి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. నా దాహం, ఊహాశక్తిని పెంపొందించడానికి అవి ఎంతగానో సాయపడ్డాయి. ఇండస్ట్రీలోకి ఫిల్మ్‌మేకర్‌గా ఎంటరైన నేను నటిగా మారిన ప్రయాణం నిజంగా ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు నటనపై మక్కువ పెరిగింది. కొన్ని పాత్రలు రాయడం, చేయడం కష్టంగా మారింది.

ఇటీవల ఓ సినిమాలో భాగంగా చెరువులో సింగిల్ షాట్ కోసం డైరెక్టర్ నన్ను అర్ధరాత్రి నిద్రలేపాడు. చల్లని నీటిలో వణుకుతున్నా.. తెల్లవారుజామున 4 గంటల వరకు షూట్ చేసి ఎలాగోలా సన్నివేశం పూర్తిచేశాం. నిజంగా ఇది నా కెరీర్‌లో మరిచిపోలేని సవాల్. ఇక టాటూస్ కేవలం ట్రెండ్ లేదా ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కాదు. ఇది ఎప్పటికీ నాతో ఉండే వ్యక్తిగత ఎంపిక. నా బాడీపైనున్న టాటూస్ అన్నింటికీ ప్రత్యేక అర్థాలున్నాయి' అంటూ వివరించింది. చివరగా ఈ మధ్య తాను వివాదాల్లో చిక్కుకున్నట్లు చెప్పిన నటి తానేది మాట్లాడినా ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని నెగెటివ్ వార్తలను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

బెడ్ రూమ్‌లో ప్రతిరోజు విధ్వంసమే.. అక్కడే చనిపోవాలి: మియా

Tags:    

Similar News