నువ్వు గెలవాలంటూ ..నాగచైతన్య కోసం స్పెషల్ పోస్ట్ చేసిన సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఏం చేసినా అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటుంది. అయితే సామ్ బుధవారం.. మీరు గెలవాలని కోరుకుంటున్నాను

Update: 2024-05-23 10:20 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఏం చేసినా అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటుంది. అయితే సామ్ బుధవారం.. మీరు గెలవాలని కోరుకుంటున్నాను.. నీ హృదయం ఏది కోరుకున్నా, మీ ఆకాంక్షలు ఏమైనా, నేను మీ కోసం నిలబడతాను. మీరు గెలవడానికి అర్హులు అంటూ పోస్ట్ చేసింది.

దీంతో ఈ పోస్టు గురించి నెట్టింట్లో తెగ చర్చ జరిగింది. అసలు సమంత ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేసిదంటూ పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో కొందరు సమంత ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ .. ఆ టీమ్ కప్పుకొట్టాలని కామెంట్ చేసిందని కామెంట్ చేశారు. కాగా, దీనిపై మరో వార్త సంచలనంగా మారింది. సమంత ఆ పోస్ట్ నాగచైతన్యను ఉద్దేశించి చేసిదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో, చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా తండేల్. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా చైతూ కూడా ఈ సినిమా మంచి సక్సె్స్ అందుకోవాలని తెగ కష్టపడుతున్నాడంట. దీంతో నాగచైతన్య హార్డ్ వర్క్ చూస్తున్న సమంత ఈ మూవీ భారీ విజయం అందుకోవాలని కోరుకుంటుంది. చైతూ గురించి సమంతకు చాలా తెలుసు కాబట్టి మీరు గెలవడానికి అర్హులు అంటూ చెప్పుకొచ్చింది. అందుకే ఈ పోస్ట్ పెట్టింది అంటున్నారు నెటిజన్స్. కాగా, దీనిపై సమంత స్పందిస్తే కానీ దీనికి గల సరైన క్లారిటీ రాదు అంటున్నారు ఆమె ఫ్యాన్స్!

Similar News