Sona Mohapatra: వక్రబుద్ధిగల స్త్రీలే అలాంటి వారికి అండగా ఉంటారు: నటిపై సింగర్ ఫైర్

బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్‌ ప్రవర్తనపై సింగర్ సోనా మోహపాత్ర దారుణంగా విరుచుకుపడింది.

Update: 2023-03-01 08:07 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్‌ ప్రవర్తనపై సింగర్ సోనా మోహపాత్ర దారుణంగా విరుచుకుపడింది. షెహనాజ్‌ను ‘వక్రబుద్ధిగల స్ర్తీ’ అంటూ తిట్టిపోసింది. విషయానికొస్తే.. 2018లో మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో పలువురు మహిళా సహోద్యోగులచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న సాజిద్ ఖాన్‌కు ‘బిగ్ బాస్’ షో కోసం షెహనాజ్ మద్దతు ఇవ్వడమే ఇందుకు కారణం. కాగా ట్విట్టర్‌ వేదికగా గిల్‌పై మాటల దాడి చేసిన సోనా.. ‘ఉన్నత విద్య, నైపుణ్యాలను పొందడానికి కొంత డబ్బు, సమయం, కృషిని వెచ్చించండి. నటన, సంగీతం, డైలాగ్.. ఏదైనా మీకు కావాల్సిన వాటికోసం ప్రాక్టీస్ చేయండి. వృత్తిలో గొప్ప ప్రతిభను చాటేందుకు ఆలోచించండి. అంతేకానీ మీ అవసరాలకోసం అవకాశవాదులైన పురుషులను పొగడటం మానుకోండి. అది నిజమైన విజయం కాదు. మహిళలు అందరూ దేవదూతలు కాదు. పురుషులంతా రాక్షసులు కాదు. సమానత్వం కోసం పోరాడండి. సాజిద్ ఖాన్ వంటి లైంగిక వక్రబుద్ధి గల వ్యక్తులకు బాసటగా నిలవాల్సిన అవసరం లేదు’ అంటూ తనదైన స్టైల్‌లో రాసుకొచ్చింది. 

Tags:    

Similar News