హీరోయిన్‌‌‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న సితార.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్న మహేష్ డాటర్

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పాప ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్. చిన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఘట్టమనేని వారసురాలు.. చిల్డ్రన్

Update: 2024-05-24 02:41 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పాప ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్. చిన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఘట్టమనేని వారసురాలు.. చిల్డ్రన్ వీడియోస్ తో భారీ మొత్తంలో సబ్ స్కైబర్స్ ను దక్కించుకుంది. డిఫరెంట్ కంటెంట్ తో మెప్పించింది. తండ్రిని కూడా ఇంటర్వ్యూ చేసిన సీతూ.. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. అటు మహేష్ బాబు కూడా పుత్రిక ఎదుగుదలను చూసి సంతోషపడిపోయాడు. ఇక తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

అన్నను ఆటపట్టించడం అంటే ఇష్టం అంటూ ఇందుకు సంబంధించిన విషయాలను పంచుకున్న ఆమె.. అన్న నుంచి ఓపికగా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చని తెలిపింది. తండ్రి నుంచి యాక్టింగ్, తల్లి నుంచి ఫ్యాషన్ సెన్స్ నేర్చుకుంటానని చెప్పింది. ఇక మహేష్ ఖలేజా సినిమాలోని సీతా రామ రాజు పాత్ర చేయాలని ఉందని తెలిపిన సితార.. యంగ్ ఇన్ ఫ్లూయెన్సర్స్ కు మంచి టిప్స్ అందించింది. ఇక లేటెస్ట్ గా వైరల్ అయిన మహేష్ - మంజుల క్యూట్ మూమెంట్ గురించి కూడా సరదాగా చెప్పుకొచ్చింది. నాన్నకు తన హెయిర్ అంటే ఇష్టమని.. అందుకే అత్త టచ్ చేయగానే వద్దని చెప్పాడని తెలిపింది. కాగా ఈ క్యూట్ పాపకు హీరోయిన్ కావాలనేది కోరిక కాగా త్వరలో ఎంట్రీ ఇస్తుందని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Similar News