నటి సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు.. లోదుస్తులపై స్పెర్మ్
భోజ్పుర్కు చెందిన బుల్లితెర యువ నటి ఆకాంక్ష దూబే (25) ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: భోజ్పుర్కు చెందిన బుల్లితెర యువ నటి ఆకాంక్ష దూబే (25) ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. షూటింగ్ కోసం వారణాసి వెళ్లిన ఆకాంక్ష.. అక్కడ ఆమె ఉన్న హోటల్ గదిలోనే ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ప్రకారం.. పోలీసులు అనుమానంతో ఆమె ప్రియుడు సమర్ సింగ్, సోదరుడు సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. సూసైడ్ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేయడంలో అనేక నిజాలు బయటకు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఆమె లోదుస్తులపై స్పెర్మ్ గుర్తించినట్లు పోలీసులు మీడియాకి తెలిపారు. అంతే కాకుండా స్పెర్మ్ ఆధారంగా కోర్టు అనుమతి తీసుకుని అనుమానితులపై డీఎన్ఏ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె లోదుస్తులపై స్పెర్మ్ ఉందంటే.. ఆకాంక్షపై అత్యాచారం ఏమైనా జరిగిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read..
స్త్రీలను బలమైన పాత్రల్లో చూడాలని కోరుకుంటున్న ప్రేక్షకులు.. Rani Mukerji