బ్యాక్‌గ్రౌండ్‌ కాదు.. సొంత టాలెంట్‌తోనే దూసుకెళ్తా: స్టార్‌కిడ్ Shanaya Kapoor

బాలీవుడ్ స్టార్ కిడ్ షనయ కపూర్‌ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి ఓపెన్ అయింది. 'బేధడక్‌' మూవీతో సినీ అరంగేట్రం చేయబోతున్న ఆమె.. ఈ ఏడాది ప్రారంభంలో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి బంధుప్రీతిపై భారీ చర్చ జరగడం ఆశ్చర్యమేసిందని చెప్పింది.

Update: 2022-09-23 11:06 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్ షనయ కపూర్‌ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి ఓపెన్ అయింది. 'బేధడక్‌' మూవీతో సినీ అరంగేట్రం చేయబోతున్న ఆమె.. ఈ ఏడాది ప్రారంభంలో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి బంధుప్రీతిపై భారీ చర్చ జరగడం ఆశ్చర్యమేసిందని చెప్పింది. తన ప్రతిభతోనే ఈ అవకాశం సంపాదించుకున్నానని, దీనికి ఎవరి సపోర్టు లేదనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరింది.

అలాగే ఈ చాన్స్ ఇచ్చినందుకు మేకర్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన యంగ్ బ్యూటీ.. నటిగా తాను అర్హురాలినని నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతున్నట్లు చెప్పింది. ఇక తనకు వచ్చిన మొదటి అవకాశాన్ని వృధా చేయకుండా నటిస్తానన్న షనయ.. బాలీవుడ్‌లో అరంగేట్రం చేయాలనే తన చిన్ననాటి కల నెరవేర్చుకోవడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నందుకు ఎంతో ఉద్వేగంగా, ఉత్సాహంగా ఉందని తెలిపింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ నిర్మిస్తుండగా.. 2023లో షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read:  బొడ్డుపై టాటూ చూపించాలని ఆ డైరెక్టర్ విసిగించాడు : Priyamani  

Tags:    

Similar News