శుభమన్ గిల్‌తో సారా టెండూల్కర్ బ్రేకప్.. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో నెటిజన్లు షాక్!

ప్రముఖ మోడల్ సారా టెండూల్కర్ స్టార్ క్రికెటర్ సచిన్ కూతురిగా సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

Update: 2024-05-22 10:30 GMT

దిశ, సినిమా: ప్రముఖ మోడల్ సారా టెండూల్కర్ స్టార్ క్రికెటర్ సచిన్ కూతురిగా సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. నిత్యం పలు ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే సారా టెండూల్కర్ గత కొద్ది కాలంగా క్రికెటర్ శుభమన్ గిల్‌లో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి సన్నిహితంగా దిగిన ఫొటోలు కూడా బయటకు రావడంతో ప్రేమ పుకార్లు జోరందుకున్నాయి. సారా, గిల్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని.. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు. కానీ దీనిపై వీరిద్దరు తమ ప్రేమపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పుకార్లకు ఆగిపోయాయి.

ఈ క్రమంలో.. తాజాగా, సారా టెండూల్కర్‌ గిల్‌‌తో కాకుండా ఓ వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని తిరుగున్న ఫొటోలు బయటకు వచ్చి చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ అమ్మడు శుభమన్ గిల్‌కు బ్రేకప్ చెప్పి గోవాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్దార్థ్ కెర్కర్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం సారా, సిద్దార్థ్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సారా, గిల్ పెళ్లి చేసుకుంటారనుకుంటే చివరిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిందిగా? అని అయోమయంలో పడిపోయారు.

 Read More..

జాన్వీ కపూర్‌కు తోడి కోడలుగా స్టార్ హీరోయిన్.. ఎంగేజ్ మెంట్ చేసుకొని షాకిచ్చిన బ్యూటీ? 




 


Tags:    

Similar News