తెలుగులో నటించడం అంత కంప్ఫర్ట్‌గా అనిపించదు.. సంచలనంగా సంయుక్త మీనన్ కామెంట్స్

‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్.. అనతి కాలంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-05-10 11:02 GMT

దిశ, సినిమా: ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్.. అనతి కాలంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ‘బింబిసారా, సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి మూవీస్‌తో తన క్రేజ్ మరింత పెంచుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే తెలుగులో నిఖిల్ ‘స్వయంభూ’ తో పాటు.. శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కూడా మూవీస్ ఓకే చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ టాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి.

‘మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించాలంటే చాలా కష్టం. భాష రాకపోవడం ఓ కారణం అయితే.. మేకప్ మరో రీజన్. ఎందుకంటే మలయాళంలో చాలా తక్కువ మేకప్ వేస్తారు. నటించడానికి కూడా చాలా కంఫర్ట్‌గా, ఫ్రీగా, నేచురల్‌గా ఉంటోంది. కానీ తెలుగులో అలా కాదు. మేకప్ చాలా ఎక్కువగా వేస్తారు. అంతే కాకుండా స్ర్కీన్‌పై మనం ఎలా కనిపిస్తామో అని.. షాట్ మధ్యలో కూడా మేకప్ చెక్ చేసుకోవాలి. అది నటించడానికి అంత కంఫర్ట్‌గా అనిపించదు. చర్మంపై ఏదో ఉన్నట్లే అనిపిస్తుంది నాకు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సంయుక్త చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News