మరో క్రేజీ ప్రాజెక్టులో సంయుక్త మీనన్.. హీరో ఎవరంటే?

‘భీమ్లా నాయక్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. తర్వాత వచ్చిన ‘బింబిసారా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.

Update: 2024-05-07 03:26 GMT

దిశ, సినిమా: ‘భీమ్లా నాయక్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. తర్వాత వచ్చిన ‘బింబిసారా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ‘సార్, విరూపాక్ష, డెవిల్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ‘విరూపాక్ష’ సినిమాతో నటన పరంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలుగులో మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుందట ఈ బ్యూటీ. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇటీవలే ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్నాడు.

త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త ను ఫిక్స్ చేశారట. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. వచ్చే నెలలో గ్రాండ్ గా లాంఛ్ చేసి, రెగ్యులర్ షూట్ కి వెళ్తారు. అప్పుడు మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి.

ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభూ అనే సినిమాతో పాటు శర్వానంద్ సరసన కూడా ఓ సినిమా చేస్తోంది సంయుక్త మీనన్.

Similar News