సీక్రెట్‌గా బాయ్‌ఫ్రెండ్‌ను మెయిన్‌టేన్ చేస్తున్న సమంత.. ఆ స్పెషల్ గిఫ్ట్ అతను ఇచ్చిందేనా? ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజులుగా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.

Update: 2024-05-03 03:35 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజులుగా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. అలాగే ఇన్ని రోజుల నుంచి హెల్త్ బాలేకపోవడంతో సినిమాలకు దూరమైన ఆమె ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఆమె నటించిన సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా, వరుణ్ ధావన్ హీరోగా కనిపించబోతున్నాడు.

ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ ఓ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసి పలు విషయాలు చెబుతుంది. అంతేకాకుండా నిత్యం తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరవుతోంది. ఈ క్రమంలో.. ఇటీవల సామ్ పుట్టిన రోజు కావడంతో ఆమె ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లింది. గ్రీస్ కు వెళ్లిన ఈ బ్యూటీ ఏథెన్స్ లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. ఏథెన్స్ లో తాను తిరిగిన కొత్త కొత్త ప్రాంతాలు, అక్కడ జరుపుకున్న బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామ్ షేర్ చేసింది.

ఇందులో ఓ ఫొటో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రోజ్ గోల్డ్ చైన్ ధరించి పిక్‌ను జూమ్ చేసి మరీ పోస్ట్ చేసింది సామ్. దానికి జిస్టి తగలకుండా జిస్ట్ లాకెట్ ఉండి.. కన్ను ఆకారంలో ఆకట్టుకుంటుంది. ఇక ఆ ఫొటో చూసిన వారంతా ఎవరిచ్చారు.. నీ సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్‌ను మెయిన్‌టేన్ చేస్తున్నావా? ఆ గిఫ్ట్ అతనే ఇచ్చాడా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆమె ఫ్యాన్స్ మాత్రం బాయ్‌ఫ్రెండ్ అయితేనే గిఫ్ట్ ఇవ్వాలా? అని మండిపడుతున్నారు. కానీ అది సమంతకు ఓ ఫ్రెండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

 Read More : చైతన్య, శోభితా రూమర్స్ పై రియాక్టైన సమంత.. ఎప్పటికీ వెనకడుగు వేయనంటూ పోస్ట్!

Tags:    

Similar News