టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో సమంతకు చాన్స్.. సూపర్ హిట్ కాంబో రిపీట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.

Update: 2024-04-29 09:14 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. అంతేకాకుండా ఓ హెల్త్ పాడ్ కాస్ట్ మొదలెట్టి అందులో పలు విషయాలు చెబుతుంది. అలాగే నిన్న తన పుట్టిన రోజు కావడంతో అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను రివీల్ చేసింది.

అయితే సమంత మరో పాన్ ఇండియా మూవీలో కూడా చాన్స్ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న మూవీలో సామ్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సమంతకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందన్న సంగతి తెలిసిందే.

ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా సామ్‌ను తీసుకున్నట్లు టాక్. సుకుమార్ మాటిచ్చి నట్లుగా సమంతను సెలెక్ట్ చేసుకున్నారట. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రెండు సినిమాలు హిట్ అయ్యేవే కాబట్టి ఆమె కెరీర్‌లో మళ్లీ వరుస ఆఫర్స్‌తో దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు. కాగా ఇప్పటికే రామ్ చరణ్- సమంత కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీనిని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించాడు.

Similar News