బర్త్ డే నాడు బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. మొత్తానికి అంతా అనుకున్నదే చేసి తాళి బొట్టుతో షాకిచ్చిందిగా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.

Update: 2024-04-28 10:19 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఆమె కొన్ని రోజుల నుంచి మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై ట్రీట్‌మెంట్ తీసుకుంది. అయితే సమంత ఇప్పుడిప్పుడే వ్యాధి నుంచి కోలుకుంటూ.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. పలు యాడ్స్ చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ సినిమాల్లోని రీఎంట్రీ ఇవ్వాలని అడుగుతూ పలు పోస్టులు పెట్టడంతో ఆమె దానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఈ అమ్మడు సినిమా ఆఫర్ల కోసం వెయిట్ చేస్తూనే పాడ్ కాస్ట్ మొదలెట్టి అందులో హెల్త్‌కు సంబంధించిన విషయాలు తెలుపుతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, నేడు సమంత పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో విషెస్ మార్మోగిపోతున్నాయి. అయితే ఈ స్పెషల్ డే అయినా సామ్ ఏదో ఒక మూవీ అప్డేట్ ఇస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమంత అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ చెప్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. నిర్మాతగా మారి మొదటి చిత్రాన్ని ప్రకటించింది. తన నిర్మాణ సంస్థలో సమంతనే హీరోయిన్‌గా ఫస్ట్ సినిమా చేస్తుంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ జత చేసింది. ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్‌తో మూవీ రాబోతున్నట్లు వెల్లడించింది.

ఇందులో సమంత రెడ్ కలర్ చీర కట్టుకొని, మెడలో తాళిబొట్టు వేసుకుని గాజులు, బొట్టు పెట్టుకుని తుపాకీ చేతిలో పట్టుకుని కోపంగా చూస్తూ షాకింగ్ లుక్‌లో కనిపించింది. దీనికి ‘‘ బంగారుమయం కావాలంటే అన్నీ మెరవాల్సిన అవసరం లేదు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్నాళ్లు అభిమానులు సమంత రీ ఎంట్రీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సామ్ కొత్త మూవీతో అందరూ అనుకున్నట్లుగా చేసి ఫ్యాన్స్‌ను సంతోషపెట్టింది. అయితే ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్‌‌ సినిమాగా రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.. డైరెక్టర్, ఇందులో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News