‘సామజవరగమన’ OTT అప్డేట్.. స్ట్రీమింగ్ అందులోనే!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సామజవరగమన’. ఈ మూవీలో మోనికా రెబ్బా జాన్ హీరోయిన్‍గా నటించగా.. తండ్రి పాత్రను నరేష్ పోషించాడు.

Update: 2023-07-17 03:46 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సామజవరగమన’. ఈ మూవీలో మోనికా రెబ్బా జాన్ హీరోయిన్‍గా నటించగా.. తండ్రి పాత్రను నరేష్ పోషించాడు. సామజవరగమనకు రాజేష్ దండ నిర్మాతగా ఉండగా.. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర సమర్పించారు. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

చిన్న బడ్జెట్ సినిమాగా జూన్ 29న థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏకంగా రూ.47 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుని దూసుకుపోతుంది. టాలీవుడ్‍లో ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ మూవీ ఇదేనంటూ ప్రేక్షకులతో పాటు పలువురు హీరోలు కూడా సామజవరగమనను ప్రశంసించారు.

కాగా, ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సామజవరగమన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రావడం ఖాయమైంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. కమింగ్ సూన్ ‘‘పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేందుకు రెడీగా ఉండండి. సీజన్ బ్లాక్‍బాస్టర్ సామజవరగమన ఆహాలోకి త్వరలో వచ్చేస్తుంది’’ అంటూ రాసుకొచ్చారు. కానీ, ఏ తేదీన స్ట్రీమింగ్ అవుతుందో మాత్రం చెప్పలేదు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే

Tags:    

Similar News