అమ్మాయిల దుస్తులపై సల్మాన్.. ఎంత కవర్ చేస్తే అంత మంచిది!!

‘కిసీ కా భాయి కిసీ జాన్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాలక్ తివారీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Update: 2023-04-30 11:16 GMT

దిశ, సినిమా: ‘కిసీ కా భాయి కిసీ జాన్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాలక్ తివారీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ‘సల్మాన్ ఖాన్ సెట్‌లో మహిళలు లో నెక్ లైన్ దుస్తులు ధరించడాన్ని బ్యాన్ చేశాడు’ అని తెలపగా.. ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అమ్మాయిల దుస్తులపై ఆంక్షలు విధించేందుకు అతనెవరు? అనే కామెంట్స్ వినిపించాయి. రీసెంట్‌గా దీనిపై స్పందించిన సల్లూ భాయి.. ‘ఇందులో డబుల్ స్టాండర్డ్ ఏమీ లేదు. స్త్రీ శరీరం చాలా విలువైనది. ఎంత ఎక్కువ కవర్ చేస్తే అంత మంచిదని అనుకుంటా. మంచి సినిమా చేస్తే అందరూ కుటుంబంతో చూడగలరు లేదంటే ట్రోల్ చేస్తారు. అమ్మాయిల డ్రెసింగ్‌కు కూడా ఇది వర్తిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News