రజనీకాంత్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగిన డైరెక్టర్

మాలీవుడ్ ఫిల్మ్ ‘జైలర్’ డైరెక్టర్ సక్కిర్ మదతిల్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగాడు.

Update: 2023-08-04 11:07 GMT

దిశ, సినిమా : మాలీవుడ్ ఫిల్మ్ ‘జైలర్’ డైరెక్టర్ సక్కిర్ మదతిల్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగాడు. తలైవా ‘జైలర్’ రిలీజ్ కానుండటంతో.. అదే పేరుతో వస్తున్న తన సినిమాను కేరళ ఎగ్జిబిటర్స్ ప్రదర్శించకపోవడమే ఇందుకు కారణం. కాగా రెండు సినిమాలు ఒకే రోజు(ఆగస్టు 10) విడుదల తేదీ ఫిక్స్ చేసుకోవడంతో.. తన చిత్రాన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు ముందుకు రావడం లేదని వాపోయాడు. ఎలాగైనా సరే తన మూవీకి థియేటర్స్ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ కేరళ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (కేఎఫ్‌సీసీ) ఎదుట ప్రొటెస్ట్ చేపట్టాడు. సక్కిర్ దర్శకత్వంలో వస్తున్న ‘జైలర్‌’కు 75 రోజుల విండో థియేటర్ స్క్రీనింగ్ అవసరమని.. అయితే చాలా మంది ఎగ్జిబిటర్లు 42 రోజులు మాత్రమే ఇవ్వాలని కోరుతున్నారని.. అలాంటప్పుడు మలయాళ సినిమాలు ఎలా అభివృద్ధి చెందుతాయని ప్రశ్నించాడు.

Tags:    

Similar News