మన క్యారెక్టర్‌ను బట్టి అవకాశాలు వస్తాయి.. సాయిపల్లవి

హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి తన సినిమా కథల ఎంపికపై ఓపెన్ అయింది. ఇటీవలి కాలంలో చాలామంది తన సెలెక్షన్‌‌పై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారన్న ఆమె.. ఏ ఆఫర్ అనుకోకుండా రాదని, మన క్యారెక్టర్‌ను బట్టి కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని ఓ సమావేశంలో చెప్పింది.

Update: 2022-10-09 13:02 GMT

దిశ, ఫీచర్స్ : హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి తన సినిమా కథల ఎంపికపై ఓపెన్ అయింది. ఇటీవలి కాలంలో చాలామంది తన సెలెక్షన్‌‌పై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారన్న ఆమె.. ఏ ఆఫర్ అనుకోకుండా రాదని, మన క్యారెక్టర్‌ను బట్టి కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని ఓ సమావేశంలో చెప్పింది. అలాగే తాను పోషించే పాత్రలకు సంబంధించి కఠినమైన నిబంధనలు పెట్టుకోనన్న సాయి.. సినిమా కథను ఎంపిక చేసుకునేటప్పుడు సహ నటుల‌పై ఆ పాత్ర ఆధారపడేలా చూసుకుంటానని తెలిపింది. ఇక తన పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉండే క్యారెక్టర్లనే ఎక్కువగా ఇష్టపడతానన్న నటి.. దేనికైనా వందశాతం న్యాయం చేయాడానికే ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఇక ఇటీవల 'విరాటపర్వం', 'గార్గి' సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. 

Tags:    

Similar News