Ray Stevenson: షూటింగ్ స్పాట్ లోనే మృతి చెందిన 'ఆర్ఆర్ఆర్' నటుడు

'ఆర్ఆర్ఆర్’ సినిమాలో విలన్ పాత్రకు ప్రాణం పోసిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ (58) నిన్న మృతి చెందారు.

Update: 2023-05-23 01:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : 'ఆర్ఆర్ఆర్’ సినిమాలో విలన్ పాత్రకు ప్రాణం పోసిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ (58) నిన్న మృతి చెందారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా ఏమి బయటకు రాలేదు. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో స్కాట్ దొరగా రే స్టీవెన్సన్ విలన్ పాత్రలో అదరగొట్టారు. 1997లోనే రూత్ గెమ్మెల్ అనే హాలీవుడ్ నటిని రే స్టీవెన్సన్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి 2005లో విడాకులు తీసుకున్నారు.ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు, ఆర్ఆర్ఆర్ టీం ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. 

Tags:    

Similar News