Priyanka Chopra: బాల్కనీలో డీప్ రొమాన్స్.. ప్రియాంక అందానికి నెటిజన్లు ఫిదా!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి బ్యూటిఫుల్ లుక్‌లో అట్రాక్ట్ చేసింది.

Update: 2023-04-24 08:00 GMT

దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి బ్యూటిఫుల్ లుక్‌లో అట్రాక్ట్ చేసింది. ఆమె నటించిన ‘సిటాడెల్’ ఏప్రిల్ 28న రాబోతుండగా విభిన్న వేదికలపై తనదైన స్టైల్‌లో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే రోమన్ హాలీడే సందర్భంగా ఇటలీలోని రోమ్ నగరంలో ఏర్పాటు చేసిన ప్రమోషన్ ఈవెంట్‌కు గ్రీన్ కలర్ గౌన్‌లో దర్శనమిచ్చి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అంతేకాదు ఇటలీ ‘సిటాడెల్’ కథలో ముఖ్యమైన భాగమని, అక్కడ చాలా రహస్యాలను కలిగి ఉన్నట్లు చెబుతూ రోమ్ అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది. ఇదిలావుంటే.. ఇదే గ్రీన్ గౌన్‌లో భర్త నిక్ జోనస్‌తో కలిసి ఇంటి బాల్కనీలో రొమాంటిక్ స్టిల్స్ ఇచ్చిన నటి.. పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ మురిసిపోయింది. కాగా ఇద్దరి అమేజింగ్ కెమిస్ట్రీ, రొమాన్స్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read.:  నటిని కాకపోతే.. ఆ పని చేసేదాన్ని: జాన్వీ 

Full View

Tags:    

Similar News