Jabardasth షో‌కి రోజా రీ ఎంట్రీ !

బుల్లితెర షోలలో జబర్దస్త్‌కి షోకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

Update: 2022-12-30 06:13 GMT

దిశ, సినిమా : బుల్లితెర షోలలో జబర్దస్త్‌కి షోకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది 2013 లో ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ తమ జీవితాలను మార్చుకున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా 'బిగ్ బాస్ హౌస్'లోకి అడుగుపెట్టి తమను తాము మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా సీనియర్ సెలబ్రిటీలే కాకుండా కొత్తవాళ్లు కూడా ఆర్థికంగా ఎదిగారు. అలాంటి వారిలో నాగబాబు, హీరోయిన్ రోజా కూడా ఒకరు అని చెప్పవచ్చు. రోజా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జబర్దస్త్ షో ఆమెను పూర్తిస్థాయిలో ఆదుకుంది. అయితే కొంత కాలంగా ఈ షో రేటింగ్ తగ్గిపోయింది. ఒక్కో కమెడియన్ , జడ్జెస్, యాంకర్లు ఇతర అవకాశాలు రావడంతో షో నుంచి తప్పుకున్నారు. రీసెంట్‌గా 500 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది జబర్దస్త్. ఈ సందర్భంగా షో కి రీ ఎంట్రీ ఇచ్చింది రోజా. దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. మంచి కామెడీ, కృష్ణ భగవాన్ కౌంటర్‌తో అది ఆకట్టుకున్నది.

Also Read... 

అన్ స్టాపబుల్ షో అనధికారిక ప్రసారాలు ఆపివేయండి.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు 

Tags:    

Similar News