కాంతారా2 కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్న రిషబ్.. ఏం ప్లాన్ రా బాబు!

ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై రికార్డుల వర్షం కురిపించిన సినిమా కాంతారా. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా నటించి, తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మూవీ కన్నడ ప్రేక్షకులనే కాకుండా తెలుగు

Update: 2024-05-01 09:33 GMT

దిశ, సినిమా : ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై రికార్డుల వర్షం కురిపించిన సినిమా కాంతారా. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా నటించి, తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మూవీ కన్నడ ప్రేక్షకులనే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకొని టాలీవుడ్‌లో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమా కూ ప్రీ సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రియులు కాంతారా2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈ మూవీ కోసం రిషబ్ శెట్టి చాలా కష్టపడుతున్నాడంట. దీని కోసం బాహుబళి రేంజ్‌లో కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ హీరో కాంతారా 2 షూటింగ్ కోసం 200x200 అడుగుల వైశాల్యంతో కుందాపుర ప్రపంచాన్ని, సెట్ రూపంలో పునః సృష్టి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అడవి బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ కోసం.. ఈ సెట్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు 600 మంది కార్పెంటర్లు ఈ సెట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారట. అలాగే రిషబ్ దీని కోసం చాలా సాహసం చేస్తున్నాడంట, కొత్త కొత్త విన్యాసాలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

Tags:    

Similar News