RGV Vyooham Teaser 2 : ఆసక్తి పెంచుతోన్న కీలక నేతల పాత్రలు..!

సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి ప్రస్తుతం వ్యూహం సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే.

Update: 2023-08-15 06:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి ప్రస్తుతం వ్యూహం సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన విడుదలైన పలు పోస్టర్స్, టీజర్ అందరికి అంచనాలను పెంచేశాయి. ఏపీ సీఎం జగన్‌కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ ఈ సంవత్సరం, రెండవ పార్ట్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తానని ప్రకటించారు.

రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్‌పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది వ్యూహం మొదటి పార్ట్‌లో చూపించనున్నారట. ఇప్పటికే మొదటి టీజర్ రిలీజైంది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ టీజర్ రిలీజ్ అయింది. అందులో మాజీ సీఎం రోశయ్య, పవన్ కల్యాణ్, చిరంజీవి, సోనియా గాంధీ, విజయ్మ,  పాత్రలను ఆసక్తికరంగా చూపించారు. టీజర్‌లో ఏముందంటే.. వైసీపీ ఏర్పాటు జగన్ అరెస్ట్ సమయంలో జరిగిన ఘట్టాలను చూపించారు. అలాగే చిరంజీవి ఇంట్లో జనసేన పార్టీ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ చర్చల ఎపీసోడ్. అంతేకాకుండా సోనియా పాత్ర ద్వారా విభజన అంశాన్ని కూడా వర్మ టచ్ చేశారు. పవన్ కల్యాణ్‌పై చంద్రబాబు సెటైర్.. పవన్ తనకు తానే వెన్నుపోటు పొడుచుకుంటాడు అంటూ సాగే డైలాగ్ అందరికీ ఆసక్తిని పెంచుతోంది.

Tags:    

Similar News