ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్న రష్మిక.. మోసపోకుండా ఉండేందుకు అలాంటి పని చేస్తుందా! పోస్ట్ వైరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూనే వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

Update: 2024-04-17 07:12 GMT

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూనే వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ.. అభిమానులతో ముచ్చటిస్తోంది. అయితే ఇటీవల ఆమె పుట్టినరోజు ఉండటంతో యూఎస్‌కు విజయ్ దేవరకొండతో కలిసి వెళ్లింది. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటపడింది.

ఇద్దరు ఓకే నెమలి ఫొటో పెట్టడంతో.. అది చూసిన నెటిజన్లు ఒకేచోట పెట్టి మరీ చూసి వీరిద్దరు లవ్‌లో ఉన్నారని నెట్టింట రచ్చ చేశారు. కానీ దీనిపై రష్మిక, విజయ్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో రష్మిక తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘‘ spanish love deception’’ అనే పేరుతో ఉన్న బుక్‌ను షేర్ చేసింది. అది చూస్తే ప్రేమలో మోసపోకుండా ఉండటం ఎలా? అనే బుక్ చదువుతున్నట్లు అర్థమవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు ప్రేమలో ఉన్న మోసాన్ని కనిపెట్టడం ఎలా? దాన్ని నుంచి బయటపడటానికి మార్గం ఏంటని తెలుసుకుంటుందేమో అని కామెంట్లు చేస్తున్నారు.

 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News