అవన్నీ మనకు అవసరమా..? రజనీకాంత్‌పై ఫైర్ అవుతున్న అభిమానులు

సీనియర్ స్టార్ హీరో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

Update: 2023-04-30 08:34 GMT

దిశ, సినిమా: సీనియర్ స్టార్ హీరో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణలతో పాటు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ కూడా పాల్గొన్నారు. అయితే ఇందులో భాగంగా తలైవా మాట్లాడుతూ.. చంద్రబాబు, బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ఒకప్పటి హైదరాబాద్‌‌కు ఇప్పుడు హైదరాబాద్‌కు ఎంతో తేడా ఉంది. అందుకు కారణం చంద్రబాబు నాయుడు’ అని కొనియాడాడు. ఈ కామెంట్స్ మింగుడుపడిన వైసీపీ నాయకులు రజనీకాంత్‌ను తిట్టిపోస్తున్నారు. కాగా దీనిపై స్పందిస్తున్న అభిమానులు.. ‘రజనీ సార్ మీకు ఇలాంటి విమర్శలు అవసరమా’ అంటూ బాధపడుతున్నారు.

Tags:    

Similar News