వైసీపీ నాయకులను కుక్కలతో పోల్చిన రజనీకాంత్.. చిరును టార్గెట్ చేయడంతో..

ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిపెట్టాలి కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ గురించి ఎందుకు?

Update: 2023-08-08 13:16 GMT

దిశ, సినిమా : ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిపెట్టాలి కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ గురించి ఎందుకు? అని చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో వైసీపీ నాయకులు దీనిపై కౌంటర్ ఇచ్చేందుకు క్యూ కడుతున్నారు. అయితే గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కామెంట్స్ చేయడం, ఇప్పుడు చిరుని టార్గెట్ చేయడాన్ని తప్పు పడుతున్నారు సినీ లవర్స్. ఈ క్రమంలోనే తనపై చేసిన విమర్శలకు వైసీపీకి జనరల్‌గా తలైవా కౌంటర్ ఎలా ఇచ్చాడో చెప్తూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇక ఇందులో ‘మొరగని కుక్కలు లేవు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండూ జరగని ఊరు లేదు. కాబట్టి మన పని మనం చూసుకుంటూ పోవాలి అంతే. అర్థమయిందా రాజా?’ అన్న రజనీ మాటలు ట్రెండ్ అవుతున్నాయి.

Tags:    

Similar News