ఆ కారణం వల్లే సినిమాలకు దూరంగా ఉన్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రీతీ జింటా

హీరోయిన్స్ కు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని అది ప్రేక్షకులు మరిచిపోతారని చెప్పుకొచ్చింది.

Update: 2024-05-25 03:34 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ నటి ప్రీతీ జింటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె నటనతో భారీ ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మూవీ రాజకుమారుడులో హీరోయిన్ గా నటించింది ప్రీతీ. అలాగే వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాలోనూ నటించి అందర్ని మెప్పించింది కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు కాదు కానీ,  తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది.

కేవలం బాలీవుడ్ సినిమాలతోనే ఫుల్ బిజీ అయ్యింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో ప్రీతీ 6 ఏళ్లుగా తెర మీద కనిపించలేదు. ఆమె చివరి చిత్రం 2018లో విడుదలైన ‘బ్రదర్ సూపర్‌హిట్’. అయితే ఇప్పుడు ఆమె మరోసారి సినిమాలతో బిజీ కానుందని తెలుస్తుంది. ‘లాహోర్ 1947’లో కనిపించబోతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రీతి మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా తన వ్యాపారం మీదే దృష్టి పెట్టింది. ఆమె కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వాలని తెలిపింది. “నాకు సినిమాలు చేయాలని అసలు లేదు. ప్రస్తుతం నేను వ్యాపారంపై దృష్టి పెట్టాను. ఇప్పుడు నేను నా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలనుకున్నాను. హీరోయిన్స్ కు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని అది ప్రేక్షకులు మరిచిపోతారని చెప్పుకొచ్చింది. అలాగే “నేను ఇంత వరకు ఎవరితో డేటింగ్ చేయలేదు. నాకు నా కుటుంబం ముఖ్యం. సినిమా అనేది ఎప్పటికీ ఉంటుందని" చెప్పుకొచ్చారు.

Similar News