హిజ్రాగా మారిన ప్రభాస్.. నడిరోడ్డుపై సిగ్గుతో సచ్చిపోయిన స్టార్ హీరో..అసలు కారణం అదేనా.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది ‘సలార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Update: 2024-05-06 08:55 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది ‘సలార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఫామ్‌లో ప్రజెంట్ ‘సలార్-2’, స్పిరిట్, రాజాసాబ్, కల్కి, వంటి చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా మారిపోయాడు. అలాగే హను రాఘవపూడితో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశాడు. దీంతో గత కొద్ది కాలంగా సోషల్ మీడియాకు దూరం అయ్యాడు. కల్కి షూటింగ్‌లో పాల్గొంటూ తన లుక్స్‌ను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు.

ఇదిలా ఉండగా ఇక ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో చేసిన సినిమాల్లో ‘చక్రం’ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ‘చక్రం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్ కు జంటగా అసిన్, ఛార్మి నటించారు. కాగా ఈ మూవీలో ఓ సన్నివేశంలో ప్రభాస్ హిజ్రా గా నటించాడు. ఆ సీన్ చేయలేక ప్రభాస్ సిగ్గుతో చాలా ఇబ్బంది పడ్డాడట. ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న ఛార్మి తండ్రి చంద్రమోహన్ మొదటి భార్య వద్దకు వచ్చి డబ్బులు ఇస్తాడు. అప్పుడే ఇంటికి వచ్చిన ఛార్మి తండ్రి చంద్రమోహన్ మీద ఫైర్ అవుతుంది.

ఇంట్లో నుంచి రోడ్డు మీదకు లాక్కొచ్చి దారుణంగా తిడుతుంది. ఈ వివాదాన్ని ఆపేందుకు ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. ఛార్మి కోపాన్ని తగ్గించి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రభాస్ అందరి ముందు హిజ్రాలా నటిస్తాడు. నిజానికి అలా నటించడం ప్రభాస్ కి ఇష్టం లేదు. కానీ కృష్ణవంశీ చాలా స్ట్రిక్ట్. ఆయనకు ఎదురు చెప్పలేక ప్రభాస్ నటించాడట. కాగా ఆ షాట్ ఓకే అయ్యేవరకు ప్రభాస్ లోలోపల సిగ్గుతో సచ్చిపోయానని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ వెల్లడించాడు.

Read More...

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇల్లు చూశారా.. ఇంద్ర భవనంలా ఉందిగా! 







 

Similar News