పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. వచ్చేసిన హరిహర వీరమల్లు టీజర్

జనసేనాని, పవన్ కళ్యాన్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే హరి హర వీరమల్లు టీజర్ వచ్చేసింది. పవన్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృదం తాజాగా విడుదల చేసింది. ధర్మం కోసం యుద్ధం అంటూ సాగే

Update: 2024-05-02 03:47 GMT

దిశ, సినిమా : దిశ, సినిమా : జనసేనాని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే హరి హర వీరమల్లు టీజర్ వచ్చేసింది. పవన్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో,AM రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృదం తాజాగా విడుదల చేసింది. ధర్మం కోసం యుద్ధం అంటూ సాగే ఈ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. పవన్ యాక్షన్ సీన్స్‌తో ఇరగదీశాడు.

మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ బందిపోటుగా కనిపించనున్నారు. అంటే ఆయనది రాబిన్ హుడ్ క్యారెక్టర్ అన్నమాట. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇది పక్కన పెడితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు. గతంలో కూడా ఆయన రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించడం వలన మూవీ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొందరు అసలు సినిమా రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో పవన్ ఫ్యాన్స్‌కు సడెన్ సర్ప్రైజ్ ఇస్తూ..ధర్మం కోసం యుద్ధం’ అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో మే 2న ఉదయం 9 గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలియజేసారు. అలానే ఈ రోజు టీజర్‌ను రిలీజ్ చేశారు.

Full View

Tags:    

Similar News