BRO Movie update : మామా, అల్లుడి హంగామా షురూ.. పిచ్చేక్కిస్తున్న BRO కొత్త పోస్టర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయితేజ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం బ్రో. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు, విలక్షణ నటుడు సముద్రఖని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

Update: 2023-06-27 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయితేజ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం బ్రో. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు, విలక్షణ నటుడు సముద్రఖని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడులైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా.. టీజర్ అప్‌డేట్ అంటూ మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ తమ్ముడు సినిమాలోని ‘వయ్యారి భామ.. నీ హంస నడక’ అంటూ వచ్చే పాటలో కట్టిన లుంగి, రెడ్ షర్ట్, రెడ్ టవల్ ధరించి మరోసారి వింటేజ్ లుక్‌లో దర్శనమివ్వగా.. మామ తరహాలోనే అల్లుడు సాయితేజ్ సైతం రెడ్ టవల్ భుజంపై వేసుకొని, లుంగి కట్టి మాస్ లుక్‌లో దర్శణమిచ్చారు. ఈ పోస్టర్‌ను చూసిన అభిమానులు చిత్ర నిర్మాత, దర్శకుడికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఇది కదా మాకు పవన్ కల్యాణ్ నుంచి కావాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ట్విట్టర్‌లో వేరే లెవెల్‌లో ట్రెండ్ అవుతోంది. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.




Tags:    

Similar News