ఆ హీరో నాకు నచ్చలేదు: అందుకే ఆయనతో మాట్లాడను.. స్టార్ నటి

Update: 2022-01-31 11:00 GMT

దిశ, సినిమా: బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌ని నిర్వహించిన నటి.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే అర్జున్ కపూర్ గురించి మంచి విషయాలు? చెప్పమని అడగ్గా.. 'ఆయన గురించి కొన్ని చెప్పడమే ఎక్కువ.

ఇంకా ఎక్కువ చెబితే బాగుండదు' అని ఫన్నీ కామెంట్ చేసింది. దీంతో సడెన్‌గా ఈ కన్వర్జేషన్‌లోకి ఎంటరైన అర్జున్ కపూర్.. 'అవును.. నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం లేదు. నీవు ఎంత తక్కువ మాట్లాడితే అందరికీ అంత మంచిది' అని రిప్లై ఇవ్వడం విశేషం. దీంతో హర్ట్ అయిన పరిణీతి.. ఇకపై అర్జున్‌తో మాట్లాడను అంటూ ముగించింది. కాగా ఇందుకు సంబంధించిన స్క్రీన్ షార్ట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CZTkbl_Dc--/?utm_source=ig_web_copy_link

Tags:    

Similar News