Parineeti Chopra-Raghav Chadha తో పెళ్లి రద్దు చేసుకోబోతుందా?

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాల ప్రేమ బంధం పెళ్లి వరకు చేరుకుంది. రీసెంట్‌గా ఇద్దరికి ఇరు కుంటుంబాల సమక్షంలో మధ్య నిశ్చితార్థ వేడుక ఘ‌నంగా జ‌రిగింది.

Update: 2023-06-26 07:34 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాల ప్రేమ బంధం పెళ్లి వరకు చేరుకుంది. రీసెంట్‌గా ఇద్దరికి ఇరు కుంటుంబాల సమక్షంలో మధ్య నిశ్చితార్థ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. అయితే ఈ పెళ్లి పెటాకులు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ప్రకారం.. ‘బ్రేకింగ్ న్యూస్.. పరిణీతి చోప్రా తన ప్రియుడు రాఘవ్ చద్దా తో విసుగు చెందింది. ఆమె సన్నిహితుల ప్రకారం, అతనితో ఎంగేజ్‌మెంట్‌ను కొద్ది రోజుల్లో విచ్ఛిన్నం చేయబోతోంది. ఆమె ఇప్పుడు అతనితో సంతోషంగా లేదు’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.




 


Tags:    

Similar News