వాళ్లను చూడగానే మీ ఇగో బయటపడుతుందా.. తివారి కామెంట్స్ వైరల్

సినీ పరిశ్రమకు చెందిన చాలామంది సెలబ్రిటీలు ఫొటోగ్రాఫర్లను విమర్శించడం తనకు నచ్చలేదంటోంది పాలక్ తివారి.

Update: 2023-04-16 12:43 GMT

దిశ, సినిమా: సినీ పరిశ్రమకు చెందిన చాలామంది సెలబ్రిటీలు ఫొటోగ్రాఫర్లను విమర్శించడం తనకు నచ్చలేదంటోంది పాలక్ తివారి. కొంతమంది నటీనటులు చాయాచిత్రకారుల సహాయాన్ని గుర్తించకుండా వారిపై చిందులేస్తారని, నిజానికి మార్కెట్‌లో తమ ఉనికిని కాపాడేందుకు వాళ్లే ముఖ్యపాత్ర పోషిస్తారనే వాస్తవాన్ని గ్రహించాలని సూచించింది. అంతేకాదు తాను చెప్పే ఈ నిజాన్ని ఎవరూ అంగీకరించరన్న నటి.. ‘కొందరికీ ఫొటో గ్రాఫర్లను కలవగానే ఇగో బయటకు తన్నుకొస్తుంది. కానీ, నేనెప్పుడూ వాళ్లపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఎక్కడ కలిసిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పడమే తెలుసు నాకు’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Also Read 

నా కోరికలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.. బోల్డ్ బ్యూటీ ఆవేదన

Tags:    

Similar News