Operation Valentine: ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన వరుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్

Update: 2024-02-21 11:41 GMT

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ,మానుషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో మన జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ హై డోసేజ్ యాక్షన్, స్టంట్స్, పవర్ ఫుల్ డైలాగులతో ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా వరుణ్.. రుద్ర ఓ పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించాడు. అతని హైట్, పర్సనాలిటీ ఈ పాత్రకు బాగా సూట్ అయింది. అలాగే వరుణ్, మానుషి మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా ట్రైలర్ లో చూపించారు. పుల్వామాలో జరిగిన దాడి, దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ పై తీర్చుకునే ప్రతీకారానికి ఆపరేషన్ వాలెంటైన్ అనే పేరు పెట్టడం, కొన్ని దేశభక్తి డైలాగులతో ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో వరుణ్ నడిపే ఎయిర్ క్రాఫ్ట్ కు మంటలు అంటుకోవడం, దాని నుంచి అతడు బయటపడటానికి చేసే ప్రయత్నం తో ట్రైలర్ ముగుస్తుంది. కాగా ఈ చిత్రం మార్చి 1న పాన్ ఇండియా లెవల్లో తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రానుంది.

 

Full View

Read More..

మిసెస్ అయిపోయిన స్టార్ హీరోయిన్.. కానీ పెళ్లి ఫొటోలు మాత్రం..! 

Tags:    

Similar News