అల్లు అర్జున్‌ కూతురు అర్హపై నిహారిక సంచలన కామెంట్స్.. షాక్‌లో ఫ్యాన్స్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అక్కర్లేదు.

Update: 2024-04-27 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బన్నీ సతీమణి స్నేహారెడ్డి తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటుంది. అర్హ క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషెన్స్‌తో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంటుంది. ఇక అర్హ ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతూ.. ఎక్కువగా అల్లరి చేస్తుందని, అయాన్ సైలెంట్‌గా ఉంటాడని ఓ సందర్భంలో బన్నీ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మెగా డాటర్ నిహారిక అర్హ చిలిపి చేష్టల గురించి చెప్పుకొచ్చింది.

‘‘అర్హ తమ వస పిట్ట. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. తన మాటలు ముద్దొస్తాయి. చాలా క్యూట్‌గా మాట్లాడుతుంది. అర్హ ఎంత క్యూట్‌గా ఉంటుందో తన మాటలు అంతే క్యూట్‌గా ఉంటాయి. అందరూ నిహా పిన్ని అని అంటే అర్హ మాత్రం నిహా అత్త అని పిలుస్తుంది. నా దగ్గరకు వచ్చి ఒళ్లో కూర్చొని.. నిహా నీ రింగులు, డ్రెస్ బాగుంది? ఎక్కడ కొన్నావ్? నన్ను అక్కడికి తీసుకెళ్తావా? అని అడుగుతుంది. ప్రశ్నలు తనవే.. ఆన్సర్ కూడా తనదే. మనం అక్కడ మాట్లాడటానికి ఏం ఉండదు. కానీ చాలా టాలెంటెడ్ పిల్లా. తప్పకుండా మంచి స్థాయికి వెళ్తుంది’’. అంటూ నిహారికి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతూ మెగా డాటర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరూ ఎప్పుడూ పిల్లల గురించి మాట్లాడని నిహారిక ఇప్పుడు అర్హ గురించి చెప్పడం నిజంగా షాకింగ్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Similar News