ఇండియన్ యూజర్లకు బిగ్ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇక పై అలా నో ఛాన్స్?

OTT ప్లాట్‌ ఫామ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు

Update: 2024-05-26 04:57 GMT

దిశ,సినిమా : OTT ప్లాట్‌ ఫామ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో నెట్‌ఫ్లిక్స్ సేవలను అందిస్తుంది. భారతదేశంలోని ప్రజలు ఒక నెట్‌ఫ్లిక్స్ ఖాతా ద్వారా పది లేదా పదిహేను మందితో పంచుకునేవారు. కొంతమంది వ్యక్తులు అమెరికా, కెనడా ఇలా ఏ దేశంలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ని అకౌంట్‌తో అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు.

భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు మెల్లగా కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీ భారతదేశం కోసం ప్రత్యేక బడ్జెట్ 199 ప్యాక్‌ను విడుదల చేసింది దానిని ఒక స్క్రీన్‌కు మాత్రమే పరిమితం చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఖాతాతో వేర్వేరు ఇళ్లలో ఉపయోగించినప్పుడు, ఆ ఖాతాలు వెంటనే నిలిపివేయబడతాయి. నెట్‌ఫిక్స్ హౌస్ హోల్డ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

హౌస్ హోల్డ్ విధానం అంటే మీరు మొదట నెట్‌ఫ్లిక్స్ ని యాక్టివేట్ చేసినప్పుడు, ఖాతా ఆ వై ఫై (Wi-Fi )పరిధిలో మాత్రమే పని చేస్తుంది. ఇతర ప్రదేశాలలో ఇది నిలిపివేయబడింది. అంటే ఇక నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలను చూడాలనుకుంటే అది యాక్టివేట్ అయిన వై-ఫై పరిధిలోనే చూడాల్సి ఉంటుంది. దీంతో భారత్‌లో బడ్జెట్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ కస్టమర్ల సంఖ్య పెరుగుతుందని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 

Similar News