ఒక అమ్మాయిలో ఎన్ని భవోద్వేగాలు ఉంటాయో అవన్నీ నాలో ఉంటాయి.. నేహా శెట్టి కామెంట్స్ వైరల్

యంగ్ బ్యూటీ నేహా శెట్టి ప్రస్తుతం ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ చిత్రంతో బిజీగా ఉంది.

Update: 2024-05-27 11:33 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నేహా శెట్టి ప్రస్తుతం ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ చిత్రంతో బిజీగా ఉంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఇక భారీ అంచనాల మధ్య మే 31వ తేదీన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటించిన నేహా శెట్టి సినిమాకు సంబంధించిన పలు ఆశక్తిక విషయాలు పంచుకుంది.

తాను చేస్తున్న బుజ్జి పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో బుజ్జి చాలా బలమైన పాత్ర. 90లలో ధనవంతుల కుటుంబానికి చెందిన ఓ పల్లెటూరి అమ్మాయి. అందంగా కనిపిస్తూనే ధృడంగా, చాలా శక్తిగల అమ్మాయిగా ఉండే పాత్ర ఇది. మూవీలో ఈ పాత్రకి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు ఉంటాయి. ఒక అమ్మాయిలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో అవన్నీ ఇందులో చూడొచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది.  

Similar News