పిల్లలతో కలిసి ఆటోలో ప్రయాణించిన నయనతార.. వీడియో వైరల్!

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక నయనతార చిత్ర పరిశ్రమకు చెందిన వార్తలకంటే ఆమె

Update: 2024-05-22 09:58 GMT

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక నయనతార చిత్ర పరిశ్రమకు చెందిన వార్తలకంటే ఆమె పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వార్తల ద్వారానే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. లవ్ ఎఫైర్ నుంచి మొదలు పెడితో సరోగసి ఇష్యూ వరకు ప్రతి దాంట్లో ఈ బ్యూటీని జనాలు ట్రోల్ చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నటికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నయన్ తన పిల్లలతో కలిసి ఓ ఆటోలో ప్రయాణించింది.

అసలు విషయంలోకి వెళితే.. నయనతార విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిదే. తర్వాత వీరు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇక వీరు తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ , తమ అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈ బ్యూటీ తన పిల్లలతో కలిసి ఓ ఆటోలో దర్శనం ఇచ్చింది. ఇటీవల నయన్ తన భర్త తో కలిసి ఇటీవలే చెన్నైలోని తిరుచెందూర్, కన్యాకుమారిలో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఆమె ఓ ఆటోలో ప్రయాణించింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతోంది. దీంతో నయన్ సింప్లీసిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Similar News