పెళ్లైన తర్వాత కూడా బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌లో నటాశా.. అందుకే హార్ధిక్ పాండ్యాతో విడాకులా?

2013లో 'సత్యగ్రహ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-05-26 05:55 GMT

దిశ, సినిమా: 2013లో 'సత్యగ్రహ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత 'బిగ్ బాస్ 8' రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. అయితే 'నాచ్ బలియే 9' ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సమయంలోనే టీవీ నటుడు ఆలీ గోనీతో నటాశా స్టాంకోవిక్ రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రోగ్రామ్ సమయంలో ఇద్దరు భిన్న మతాలకు చెందిన వారు కావడంతో సాంస్కృతిక విభేదాలతో నటాషా, గోనీ బ్రేకప్ చేసుకుంటున్నామని వెల్లడించారు.

గోనీతో బ్రేకప్ తర్వాత ఓ నైట్ క్లబ్‌లో హార్ధిక్ పాండ్యాని కలిసిన నటాశా.. కరోనా లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం చాలా దూరం వెళ్లింది. హార్ధిక్ పాండ్యా హాలీడేలో ఉన్నప్పుడు సముద్రం మధ్యలో నావలో నటాషాకి ప్రపోజ్ చేయగా ఆమె 'ఎస్' చెప్పడంతో ఈ ఇద్దరూ రిలేషన్‌లోకి వెళ్లారు. పెళ్లికి ముందే నటాషా గర్భం దాల్చి కొడుకు పుట్టిన మూడేళ్లకు 2023, ఫిబ్రవరి 14న రెండు మతాల సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా ఐపీఎల్ 2024 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ కావడమే కాకుండా సొంత ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ ఫేస్ చేశాడు హార్ధిక్ పాండ్యా. తాజాగా నటాశా స్టాంకోవిక్‌, హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి కారణం నటాషా స్టాంకోవిక్ పాత బాయ్‌ఫ్రెండ్ ఆలీ గోనీ అని సోషల్ మీడియా టాక్ వినబడుతోంది. అయితే పెళ్లైన తర్వాత కూడా నటాశా స్టాంకోవిక్, తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఆలీ గోనీతో రిలేషన్‌లో ఉన్నట్టుగా హార్ధిక్ పాండ్యాకి తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి, విడాకుల దాకా వెళ్లినట్లు తెలుస్తోంది.. అయితే ఇప్పటిదాకా నటాషా కానీ, హార్ధిక్ పాండ్యా కానీ విడాకుల గురించి అధికారికంగా ప్రకటించలేదు.

Similar News