స్టార్ హీరోయిన్‌ను గన్‌తో బెదిరించిన నాని.. భయంతో వణికి పోయిన బ్యూటీ.. కారణం ఏంటంటే

‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నది.

Update: 2024-05-13 09:11 GMT

దిశ, సినిమా: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నది. ఇటీవల యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్.. ఇప్పుడు పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ నాలుగు చిత్రాలు కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవే కాకుండా అటు మూవీ ఈవెంట్స్.. అవార్డు ఫంక్షన్లలోనూ సందడి చేస్తుంది రష్మిక. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ హంగామా చేస్తుంది.

అయితే ఓ వీడియోలో నాని గన్‌తో రష్మి్కను బెదిరించాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది.. అసలు విషయంలోకి వెళితే నాని రష్మిక కలిసి ‘దేవదాస్’ అనే మూవీ చేశారు. ఈ సినిమాలో నాగార్జున కూడా నటించారు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, నాని, రష్మిక , ఆకాంక్ష సింగ్ పాల్గొన్నారు.. ఈ ఇంటర్వ్యూలో నాని రష్మికాను నీ ఫేవరెట్ కో యాక్టర్ ఎవరు.? అని ప్రశ్నించాడు. దీంతో నాగార్జున కూడా రష్మికాను ఇదే ప్రశ్న అడిగి.. విజయ్ దేవరకొండ, నాగ శౌర్య , నాని ఈ ముగ్గురిలో ఎవరు నీ ఫేవరెట్ అని అన్నారు. దానికి రష్మిక తడబడుతుంటే నాని అక్కడే టేబుల్ పై ఉన్న గన్ తో ఆమెను బెదిరించాడు. దాంతో రష్మిక నాని పేరు చెప్పింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ మాకు కూడా ఫేవరేట్ హీరో నానినే అని కామెంట్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Similar News