'మనం' సినిమా చూస్తుండగా స్క్రీన్ పై మెరిసిన సమంత.. చైతు రియాక్షన్ ఇదే..

టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ఒకరిగా పిలువబడిన నాగ చైతన్య - సమంత అభిమానులకు ఆ సంతోషాన్ని పూర్తిగా ఇవ్వలేకపోయారు. పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు

Update: 2024-05-24 08:17 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ఒకరిగా పిలువబడిన నాగ చైతన్య - సమంత అభిమానులకు ఆ సంతోషాన్ని పూర్తిగా ఇవ్వలేకపోయారు. పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరు ప్రేమలో ఉన్నప్పుడు వచ్చిన ' మనం ' సినిమాలో హీరోయిన్ గా సమంత నటించగా.. ఈ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత రీల్ కాదు రియల్ అని తెలిసేసరికి మరింత హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ రీరిలీజ్ టైంకు ఇద్దరు విడిపోవడాన్ని తట్టుకోలేక పోతున్నారు. కాగా 2014 మే 23న విడుదల కాగా పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా హైదారాబాద్, వైజాగ్, విజయవాడలో మూవీని రీరిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సందర్భంగా డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో కలిసి సినిమా చూసాడు హీరో నాగ చైతన్య. తండ్రి నాగార్జున, తాత అక్కినేని నాగేశ్వర రావు, తమ్ముడు అఖిల్ కలిసి చేసిన మూవీ చూసి సంతోషం వ్యక్తం చేశాడు. అయితే తన మాజీ భార్య స్క్రీన్ పై మెరిసినప్పుడు చైతు రియాక్షన్ ఎలా ఉంటుందోనని వెయిట్ చేసిన ఫ్యాన్స్.. ఆ క్షణాలను క్యాప్చర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిజానికి చై, సామ్ ను ఇంకా ప్రేమిస్తున్నాడని.. ఆమె తెరపై కనిపించగానే తన కళ్లలో చూసిన హ్యాపీనెస్ ఇందుకు ఉదాహరణ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా కలిస్తే బాగుంటుంది కదా అని ఆశ పడుతున్నారు.

Click Here For Twitter Post..

Similar News