సమంతకు బిగ్ షాకిచ్చిన నాగచైతన్య.. అసలు ఏమైందంటే!

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత. మొదటి సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ నటి, తర్వాత వరసగా ఆఫర్స్ అందుకొని టాలీవుడ్ లక్కీ గర్ల్‌గా మారిపోయింది.

Update: 2024-05-10 09:55 GMT

దిశ, సినిమా : ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత. మొదటి సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ నటి, తర్వాత వరసగా ఆఫర్స్ అందుకొని టాలీవుడ్ లక్కీ గర్ల్‌గా మారిపోయింది. ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ అమ్మడు లైఫ్ ఊహించని విధంగా టర్న్ అయ్యిందనే చెప్పవచ్చు.

ఇక సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు తన హాట్ , క్యూట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత వీరు మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఇక విడాకులైనప్పటి నుంచి ఈ నటికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఈమెను ట్రోలర్స్ ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. తాజాగా సామ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

ఈ మధ్యకాలంలో శోభిత ధూళిపాల,నాగచైతన్య,సమంతల మ్యాటర్ ఏ విధంగా ఇండస్ట్రీలో వైరల్ అయిందో మనం చూసాం. ఆ టైంలో చాలామంది సమంతను ట్రోల్ చేశారు. విడాకులు ఇచ్చేసిన దానివి నీకెందుకు అతడు ఎవరితో వెళ్తే అంటూ ఘాటుగా స్పందించారు . అయితే మరొకసారి సోషల్ మీడియాలో సమంత పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది. అయితే ఈ సారి ట్రోలింగ్‌కు కారణం శోభిత కాదండోయ్.. సాయిపల్లవి. ఫిదా బ్యూటీ తాజా బర్త్ డే జరుపుకున్న విషయం తెలిసిందే. ఆమె పుట్టిన రోజు సందర్భంగా తండేల్ టీం..సాయిపల్లవికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో చైతన్యకు పల్లవి ప్రేమగా గోరు ముద్దలు పెడుతుంటుంది. ఇక ఇది చూసిన ట్రోలర్స్.. చైతూ సమంతకు మరోసారి ఆ విధంగా షాకిచ్చాడు. నువ్వు లేకపోతే ఏంటీ నన్ను అర్థం చేసుకునేవారు, నాకు గోరుముద్దలు పెట్టేవారు ఉంటారు అంటూ ఇన్ డైరెక్ట్‌గా చెప్పాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Read More...

పెళ్లైన కొన్ని రోజులకే నటితో ప్రేమలో పడ్డ నాగార్జున.. ఆయన వార్నింగ్‌తో భయపడిపోయిన హీరోయిన్ ఏం చేసిందంటే? 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News