‘మనం’ సినిమాలో సమంతతో కలిసి ఉన్న సీన్ చూసి ఏడ్చేసిన నాగచైతన్య.. వీడియో వైరల్

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి చెందిన వారు కలిసి నటించిన సినిమా ‘మనం’.

Update: 2024-05-27 07:07 GMT

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి చెందిన వారు కలిసి నటించిన సినిమా ‘మనం’. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, అఖిల్, అమల, నాగచైతన్య, సమంత, శ్రియ శరణ్ కలిసి నటించారు. అయితే ఈ మూవీ విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 23న మనం రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. నాగచైతన్య థియేటర్‌కు వెళ్లి సినిమాను చూశాడు. అక్కినేని నాగేశ్వరరావు సీన్ చూసి ఏడ్చాడు. అలాగే ఆ తర్వాత వచ్చిన సమంతతో వచ్చే సీన్‌లోనూ  బాధపడుతున్నట్లు కనిపించాడు.

దీంతో చై పక్కన ఉన్న అతను ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ వారు యూట్యూబ్ ద్వారా షేర్ చేయడంతో అది వైరల్ అవుతోంది. కాగా, సమంత, నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి కాపురం కొద్ది కాలం బాగానే సాగినప్పటికీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి సామ్ మయోసైటీస్ బారిన పడటంతో సినిమాలకు దూరమైంది.

ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. ఇటీవల వ్యాధి కాస్త తగ్గుతుండటంతో యాడ్స్ చేస్తూ హాట్ ట్రీట్‌తో నెట్టింట తెగ రచ్చ చేస్తోంది. ఇక చైతన్య మాత్రం వరుస సినిమాలు చేస్తూ హిట్ కోసం తాపత్రపడుతున్నాడు. ప్రస్తుతం చందూ మెండేటి డైరెక్షన్‌లో తండేల్ మూవీ చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కావొస్తుంది. అయితే నాగచైతన్య తండేల్‌తో హిట్ కొట్టాలని భారీ ఆశలతో ఉన్నాడు.


Full View

Similar News